వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి ఎంఈఓ బాలాజీ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న మాట్లాడుతూ దామరచర్ల మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలలో పేద వర్గాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. సరిపడా బాత్రూల సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినిలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్యూరిఫైడ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.పేద విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేటట్టు ప్రణాళిక తయారు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాను ప్రసాద్, శివ,మధు,సూర్య లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.