- టీఎస్‌డబ్ల్యూఆర్ ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ రాజు
- శ్రీ చైతన్య స్కూల్‌లో ‘సైన్స్ ఎక్స్ పో’
వేద న్యూస్, సుల్తానాబాద్:
శ్రీ చైతన్య స్కూల్ లో బుధవారం నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని సైన్స్ ఎక్స్ పో-2024ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్ పై అవగాహన పెంపొందించుకొనేలా వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ డబ్ల్యూఆర్ సుల్తానాబాద్ ప్రిన్సిపాల్ సత్య ప్రసాద్ రాజు , గెస్ట్ అఫ్ హనర్ గా ఆర్. శ్రీనివాస్ విచ్చేసి ఎక్స్ పోను ప్రారంభించారు.

విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వర్కింగ్ మోడల్స్ ను, సైన్స్ ప్రాజెక్ట్ లను వీక్షించి..విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సత్య ప్రసాద్ రాజు మాట్లాడుతూ సైన్స్ మనిషి జీవితం లో భాగమని, ప్రతీ పని సైన్స్ తో ముడిపడి ఉంటుందని చెప్పారు. చిన్నపిల్లలైనా వారి ప్రతిభ పాటవాలకు కొదవలేదని ప్రశంసించారు. వారు తయారుచేసిన వర్కింగ్ మోడల్స్ వారి ప్రతిభను రుజువు చేస్తున్నాయని వెల్లడించారు.
ఇలాంటి అవకాశాలు ఇంకా పిల్లలకు కల్పిస్తే వాళ్లు తప్పనిసరిగా మంచి స్థాయికి చేరుకుంటారని స్పష్టం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య పిల్లల్లో చైతన్యాన్ని నింపి..మానవ అభివృద్ధి కి తోడ్పడాలన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న జ్ఞానాన్ని వెలికితీసే ఈ ప్రయత్నం చేసిన పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మమత మాట్లాడుతూ ప్రస్తుతం ఏ విషయమును అయినా చాలా సులభంగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు కూడా వారి తెలివితేటలను ప్రపంచానికి తెలిపే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల కల్పిస్తుందని స్పష్టం చేశారు.

‘నాసా’ ప్రోగ్రాం ద్వారా సుల్తానాబాద్ పేరును ప్రపంచ నలుమూలల చాటుతామని తెలిపారు. ముఖ్య అతిథులు విద్యార్థుల ప్రతిభను ప్రసంశిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మల్లేంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, ఏజీఎం రాజు, ఏజెడ్‌ఏసీ ప్రవీణ్ , అకాడమిక్ డీన్ సతీష్ , ప్రైమరీ ఇన్ చార్జి రాధిక , ప్రి- ప్రైమరీ ఇన్ చార్జి మానస, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రంజిత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.