వేద న్యూస్, వరంగల్ :
ఎస్సీ, ఎస్టీల హక్కులకు అండగా నిలిచే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేయొద్దని ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ యాదగిరి అన్నారు. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై ఓ మహిళ అత్యాచార, అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై ఆయన గురువారం స్పందించారు. వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీ, ఎస్టీలను బలిచేయవద్దని హితవుపలికారు. నిజనిర్ధారణ చేయకుండా, కార్పొరేటర్ స్థాయి వ్యక్తిపై అకారణంగా అత్యాచారం, అట్రాసిటీ కేసు నమోదుచేయడం సరికాదన్నారు. గుండేటి నరేందర్ ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.