- గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో సులభ్ కాంప్లెక్ లేక ప్రయాణికులు అలాగే ఇతర పనులపై మండల కేంద్రానికి వచ్చే వారిలో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు… అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ షెడ్డు ను తొలగించి అదే స్థలంలో నూతనంగా సులాబ్ కాంప్లెక్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు మానకొండూరు నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
కాగా, మండలకేంద్రానికి చెందిన కొంతమంది ఇది ఇక్కడ వద్దు అని ఒకరు ..ఇక్కడే కావాలని ఇంకొకరు ఇలా దీనిపై కూడా రాజకీయం చేయడం సరికాదని ప్రజల అవసరాల దృశ్య అన్ని ఆలోచించిన తరువాత ఎవరికి ఇబ్బందులు కలగకుండా రైతు బజార్ షెడ్డు ను తొలగించి ఈ స్థలంలో సులాబ్ కాంప్లెక్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు ఇవ్వగా, వారి ఆదేశాలు మేరకు పనులు చేపట్టడం జరుగుతుంది అని ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. దీనికి అందరి సహకారం ఇవ్వాలని వారు కోరారు.