వేద న్యూస్, డెస్క్:
మంత్రి సీతక్కకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయ్సెస్ గ్లోబల్ ఫెలోషిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజాసేవల రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాయకులను ఈ సదస్సు ఆహ్వానిస్తుంది. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం సీతక్క చూపుతున్న కృషిని గుర్తించి ఈ గౌరవం అందజేయడం విశేషం.
ఈ నెలలో నెదర్లాండ్స్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మహిళా–శిశు సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి చొరవల గురించి సీతక్క వివరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించడం పట్ల మంత్రిత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.