Oplus_16908288

 

 వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి:

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా విచ్చేశారు.

సహోదర స్నేహబంధానికి ప్రతీకగా, సోదర ప్రేమతో, ఆప్యాయతతో సీతక్క పటేల్ రమేష్ రెడ్డి కి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని సీతక్క ఆకాంక్షించారు.