వేదన్యూస్ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డిని తప్పించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఉంది.
సీఎంగా రేవంత్ రెడ్డి స్థానంలో మంత్రిగా ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ని ఎంపిక చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు.
కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి లెక్క శ్రీధర్ బాబు కు వసూళ్ల రాజకీయం తెలియదు. అందుకే అతన్ని పక్కకు పెట్టారు. సీఎం రేసులో నల్గోండ ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులు పోటీ పడుతున్నారు. ఢిల్లీకి ఎవరూ ఎక్కువగా బ్యాగులు పంపితే వాళ్లనే ఆ పదవి వరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.