వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కి మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న గట్టును తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ సభ్యుడు ఖమ్మంపాటీ శంకర్ మాట్లాడుతూ మిర్యాలగూడ మండలంలో అవంతిపురం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గట్టు ఉండడం వల్ల విషపూరితమైన పాములు తేళ్లు సంచరిస్తూ విద్యార్థినిలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.రెండు రోజుల క్రితం విషపూరితమైన పాము పాఠశాలలో చొరబడి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.గట్టు ఉండటం వల్ల గిరిజన విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం లేక మానసిక శారీరిక దృఢత్వాన్ని కోల్పోగలుగుతున్నారన్నారు. అదేవిధంగా గిరిజన బాలికల పాఠశాలలో పురుష ఉపాధ్యాయుడు ఉండడం వల్ల విద్యార్థినిలు ఇబ్బందికి గురవుతున్నారు కావున జిల్లా కలెక్టర్ గిరిజన విద్యార్థుల పట్ల శ్రద్ధతో ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న గట్టును తొలగించి మహిళా విద్యాసంస్థలో పురుష ఉపాధ్యాయుని కాకుండా మహిళా ఉపాధ్యాయురాలను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్,తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్,జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు.