వేద న్యూస్, కరీంనగర్:

భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ పట్టణంలో డిఐఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పట్టణంలో పర్మిషన్ లేకుండా నడుపుతున్న జూనియర్ కళాశాలలనుమూసివేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ధర్నా అనంతరం ఆఫీసర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి సంద గణేష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పర్మిషన్ లేని కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.  ఓకే క్యాంపస్ పేరుతో అనేక క్యాంపస్లు నడుపుతున్న డిఐఈఓ ఎంక్వయిరీ చేసి .. అలా నడుపుతున్న క్యాంపస్ ల పైన విచారణ కమిటీ వేయాలని కోరారు.