వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఆశించిన విద్యార్థులకు ప్రభుత్వం నిరాశ కలిగించింది అని ఇప్పటికీ బకాయిలో ఉన్న రూ.8,350 కోట్ల స్కాలర్ షిప్ రియంబర్స్మెంట్ లను ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్కాలర్ షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కాలర్ షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు అని అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా మహాసభలు ఫిబ్రవరి 19,20న నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయడం కొరకు ఎస్ఎఫ్ఐ ప్రతి ఒక్క కార్యకర్త తమ శక్తి మేరకు పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.అనంతరం నూతన కమిటీని 11 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు జగన్ నాయక్ ,ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, మనీ, తరుణ్ కుమార్ ,ఈశ్వర్ ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.