వేద న్యూస్ , మరిపెడ:

మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో 65వ ఎస్ జి ఎఫ్ ఐ మరిపెడ మండల స్థాయి లో వివిధ క్రీడల ఎంపికలు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి నిర్వహణలో జరిగాయి.

వివిధ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను జోనల్ స్థాయికి పంపించారు. వారికి జోనల్ స్థాయి క్రీడలు దసరా సెలవుల అనంతరం నిర్వహిస్తారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి బయగాని రామ్మోహన్, మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, పలు పాఠశాలలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొన్నారు.