షాడో ఆర్ట్స్ వ్యవస్థాపకురాలు కుసుమ చందన

వేద న్యూస్, వరంగల్ టౌన్:

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని షాడో ఆర్ట్స్- కళారంభం సంస్థ సంయుక్తంగా వరంగల్‌లోని లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ లో క్రియేటివ్ ఆర్ట్ వర్క్‌షాప్‌ను బుధవారం నిర్వహించింది. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, కళల ద్వారా వారి భావ వ్యక్తీకరణకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యమని షాడో ఆర్ట్స్ వ్యవస్థాపకురాలు కుసుమ చందన అన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్లే మోడలింగ్, టెక్స్చర్ వర్క్స్ మరియు టచ్-బేస్డ్ ఆర్ట్ కార్యకలాపాలను నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,
షాడో ఆర్ట్స్- కళారంభం టీమ్ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలు చూపిన ప్రతిభను ప్రశంసించిన సంస్థ ప్రతినిధులు, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం, గుర్తింపు, ఆనందాన్ని పెంపొందించడంతో పాటు, ‘కళ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’ అనే సందేశాన్ని చాటింది.