వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి ఒక గొర్రెను అపహరించి ఆటోలో తీసుకొని వెళ్లారు. వారిని సంపత్ వెంబడించగా తప్పించుకొని పారిపోయారు. ఈ మేరకు సంపత్ దామెర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 .