వేద న్యూస్, వరంగల్: 

మెప్మా సిబ్బంది  పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి 106–వరంగల్ (తూర్పు) నియోజక వర్గానికి సంబందించి స్వీప్-2024(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఏలక్టోరల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమం లో భాగం గా శనివారం కాకతీయ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో (రిసోర్స్ పర్సన్)  ఆర్ పి లకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ తో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారిని మాట్లాడుతూ  వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం తేవడానికి   కళాజాత బృందాల సహకారం తో ఆట పొటలు రంగోలి పోటీలు, మెహందీ, మొగ్గుల పోటీలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విస్తృతం గా ప్రచారం  నిర్వహిస్తున్నామని అన్నారు. వీటి  అంతిమ ఉద్దేశం పోలింగ్ శాతం  పెరగడం కోసమేనని, ఆర్ పి లకు క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయని,  ఓటరు స్లిప్పులు అందజేసే ప్రక్రియ లో భాగంగా ఓటు హక్కు  ప్రాధాన్యతను వివరించి వారిని పోలింగ్ కార్యక్రమం లో భాగస్వాములను చేయాలని అన్నారు. బల్దియా అదనపు కమిషనర్  అనిసుర్ రషీద్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో మెప్మా సిబ్బంది ప్రధానంగా ఆర్ పి లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) ను ఉల్లంఘించడానికి వీలు లేదని వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించే  ఎన్నికల ర్యాలీలలో సమావేశాలు పాల్గొనడానికి అనుమతి లేదని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఆర్ పి లతో పాటు సమావేశం లో పాల్గొన్న అధికారులు సిబ్బంది చేత ఎన్నికల ప్రతిజ్ఞ నిర్వహింపజేశారు. అంతకు ముందు సెమినార్ హాల్ నుండి మెడికల్ కళాశాల ప్రధాన ద్వార   కాకతీయ కళా తోరణం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పిడబ్ల్యుడి జిల్లా నోడల్ అధికారి సత్యవాణి,  మెప్మా పిడి బద్రు నాయక్, వరంగల్ (తూర్పు) నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోలా రాజేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసిల్దార్ లు ఇక్బాల్, నాగేశ్వరరావు టి ఎం సి రమేష్, మెప్మా సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.