- ఒలంపియాడ్ ఫలితాలలో సత్తా చాటిన మందమర్రి చైతన్య పాఠశాల
వేద న్యూస్, మందమర్రి:
జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ఓ ఒలంపియాడ్ పరీక్షలలో మందమర్రి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు 88 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ ఎ నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
చైతన్య పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం చైర్మన్, డైరెక్టర్ లు మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఎజిఎం ఎం రాజు, కోఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ఎర్ర సంపత్, సి బ్యాచ్ ఇంచార్జ్ రవికుమార్, ఒలంపియాడ్ ఇంచార్జ్ లావణ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.