వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

 

మిల్స్ కాలనీ ఎస్సై తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ దళిత మహిళ మరియమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్థానికులు, మహిళ ఇచ్చిన సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకులు అర్ధరాత్రి వరకు నిర్వహణ కొనసాగిస్తున్నారు.

 

అటు పెట్రోలింగ్ వెళ్లిన ఎస్సై హోటల్ వద్దకు వెళ్లి గ్యాస్ సిలిండర్ తీస్తుండగా, ఎందుకు తీస్తున్నారని నిర్వాహకులు అడిగారు. దీంతో అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ తన పై ఎస్సై దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై తన కుమారుడి పై కూడా దాడి చేశాడని ఆమె ఆరోపించారు. ఇది ఇలా ఉంటే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట ఎస్సై మహిళ పై చేయి చేయగా..ఎస్సై ని ఆ మహిళ తోసి వేసినట్టు ఆ వీడియో లో ఉండటం వైరల్ గా మారింది.