వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా బుధవారం మందమర్రి ఏరియాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఏరియాలో 4835 మంది కార్మికుల గాను 11 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా, 4515 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించడంతో పోలింగ్ 93.38శాతంగా నమోదయింది.

ఓటింగ్ అనంతరం బుధవారం సాయంత్రం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం రాత్రి వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా 39,805 మంది ఓటర్లకు గాను 37, 451మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 95శాతం పోలింగ్ శాతం నమోదయింది. ఆర్జీ 1 ఏరియాలో 5384 మంది గాను 5044 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93.70శాతం పోలింగ్ శాతం నమోదయింది.

ఆర్జీ 2 ఏరియాలో 3556 మంది గాను 3369 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 94.74శాతం పోలింగ్ శాతం నమోదయింది. ఆర్జీ 3 ఏరియాలో 3884 మంది గాను 3612 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93శాతం పోలింగ్ శాతం నమోదయింది.

భూపాలపల్లి ఏరియాలో 5442 మంది గాను 3369 మంది ఉద్యోగులు ఓటు 5123 వినియోగించుకోవడంతో 94.13శాతం పోలింగ్ శాతం నమోదయింది. బెల్లంపల్లి ఏరియాలో 996 మంది గాను 959 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 96.30శాతం పోలింగ్ శాతం నమోదయింది. శ్రీరాంపూర్ ఏరియాలో 9127 మంది గాను 8491 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93శాతం పోలింగ్ శాతం నమోదయింది.

కొత్తగూడెం ఏరియాలో 2326మంది గాను 2207 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 94.88శాతం పోలింగ్ శాతం నమోదయింది. ఎల్లందు ఏరియాలో 614మంది గాను 604 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 98.37శాతం పోలింగ్ శాతం నమోదయింది. మణుగూరు ఏరియాలో 2450 మంది గాను 2378 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 97.06శాతం పోలింగ్ శాతం నమోదయింది.

కార్పొరేట్ లో 1149 మంది గాను 1191 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 96.47శాతం పోలింగ్ శాతం నమోదయింది.

సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలువగా ప్రధానంగా ఏఐటియు, ఐఎన్టియుసి, సిఐటియు ల వద్ద ప్రధానంగా పోటీ నెలకొంది. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.