వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట :

ఎల్లారెడ్డి పేట మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యంతో పాటు కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం విక్రయాలు సైతం జరుగుతున్నాయన్న ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. నాటు సారా విక్రయం, రవాణా జరుగుతున్నా ఎక్స్సైజ్ అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు.
మండలంలోని పలు గిరిజన తండాల్లో, గ్రామాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కల్తీ కల్లు,గుడుంబా తయారీ,కల్తీ మద్యం తయారీ, సరఫరా,విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ,రాష్ట్ర ఎక్సైజ్ జ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు.