•  సొంత ఖర్చుతో మొరం పోయించిన ప్రశాంత్
  •  యువకుడికి గ్రామస్తులతో పాటు పలువురి అభినందన

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
వీణవంక మండలంలోని లస్మక్కపల్లి ప్రధాన రహదారిపై గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో మొరం పోయించారు. స్వయంగా తాను సైతం పార పట్టుకుని మొరంను రోడ్డుపై చదును చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ రోడ్డు బాగు చేయడం పట్ల గ్రామస్తులతో పాటు పలువురు సంతోషం వ్యక్తం చేశారు. యువకుడు ప్రశాంత్ ను అభినందించారు.