•  2008-09 బ్యాచ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్‌ను అభినందించిన ఉపాధ్యాయులు
  •  రూ.50 వేలు విలువ చేసే ఆడియో సిస్టం‌ను అందించిన పూర్వ విద్యార్థులు

వేద న్యూస్, కరీంనగర్:

తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఉడతాభక్తిగా సాయం చేశారు. వివరాల్లోకెళితే.. జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయానికి శుక్రవారం ఆ స్కూల్‌లో చదువుకున్న 2008-09 ఎస్ఎస్‌సీ బ్యాచ్ స్టూడెంట్స్ సౌండ్ సిస్టం బహూకరించారు.

పాఠశాలలో పలు కార్యక్రమాల నిర్వహణకు ఆడియో సౌండ్ సిస్టం లేక కొంత ఇబ్బంది కలుగుతున్నదన్న విషయాన్ని ఉపాధ్యాయులు తెలపగా, విద్యార్థులు ముందుకొచ్చి అందజేశారు. రూ.50 వేలు విలువ చేసే సౌండ్ సిస్టంను స్కూల్‌కు అందించడటం పట్ల ఆవాస విద్యాలయం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

తమ ఉన్నతికి తోడుపడిన పాఠశాలకు తిరిగి తమ వంతు సాయం చేయడం సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా ఆవాస పూర్వ విద్యార్థులు వెల్లడించారు. కార్యక్రమంలో
ప్రధాన ఆచార్యులు సుధాకర్ రావు పోల్సాని, పూర్వ ప్రధాన చార్యులు టి. రాజమౌళి, ఉపాధ్యాయులు సర్వోత్తమ్ రెడ్డి, శ్రీకాంత్, ఆవాస పూర్వ విద్యార్థులు శివనాథుని తరుణ్, ఉప్పుల మహిపాల్ రెడ్డి, నాగమల్ల రాజేష్, లోనే ప్రశాంత్, వలబోజు రమణాచారి, ముల్లుపోజు కమలాకర్, కందాల సాయికుమార్, గాజుల సాగర్, బండి రంజిత్ కుమార్, సాకర్ మాన్ వెంకటేష్, అంబీరు శ్రీకాంత్, పెద్ది తిరుపతిరెడ్డి, కాశిరెడ్డి రాజు, డబ్బేట రాకేష్, ఆశ్పతి సంతోష్, ముసుకు శ్రీనివాస్, పొన్నాల  నరేష్, సింగ కృష్ణమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.