వేద న్యూస్, హన్మకొండ /దామెర:

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నారు. అందు లో  భాగంగా బుధవారం దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి( స్పెషల్ ఆఫీసర్) కే.వీ.రంగా చారి గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.

 గ్రామంలో తిరుగుతూ తాగు నీటి  సమస్యలను, వీది లైట్ల నిర్వహణ గురించి ఇతర అడిగి తెలుసుకున్నారు. నంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి కి సంబంధించిన సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు అందరూ గ్రామ అభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలని, సహకరించాలని కోరారు.

        ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, కారోబార్ బొబ్బిలి, అంగన్ వాడీ టీచర్లు,మహిళా సంఘాల వి.ఓ.ఏ లు,ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు దురిషెట్టి బిక్షపతి, పోతుల కొమ్మాలు,సదిరం పోచయ్య, సదిరం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.