- ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు
వేద న్యూస్,బోయినిపల్లి:
‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రం చెందిన సుంకపాక తార, నరసయ్య దంపతులు.
తమ ఆవు 21 రోజుల క్రితం దూడకు జన్మనివ్వగా, శనివారం దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా బారసాల నిర్వహించారు. అలాగే కృష్ణాష్టమి పురస్కరించుకొని వారి మనవల్లు, మనవరాళ్ళు, కృష్ణుడు, గోపికమ్మ, వేషాలు వేసి కృష్ణాష్టమి, వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణాష్టమి, రోజు తమ ఆవు దూడ లకు బారసాల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం మరువలేని రోజు అని పేర్కొన్నారు.
