- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వేద న్యూస్, రాయపర్తి:
ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం వల్ల ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని ఆరెగూడెంలో దుర్గామాత పర్వదిన ఉత్సవాలలో మంగళవారం పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పండగతో గ్రామంలో సందడి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.