వేద న్యూస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధి లోని జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కర్రీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రీడా పోటీలు 12 ,13 తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోటీలు ఉంటాయన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ తో పాటు నగదు బహుమతి అందిస్తున్నామని తెలిపారు.
ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెంబర్లను 9396540067,8688010549 సంప్రదించి ఎంట్రీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోని విజయవంతం చేయలని కోరారు.