వేద న్యూస్, కరీంనగర్ :

స్థానిక అశోక్ నగర్ లోని ఎస్ఆర్ డీజీ స్కూల్‌లో పిల్లల ఫ్యాషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇది విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని ఎస్ఆర్ స్కూల్స్ జోనల్ ఇన్‌చార్జ్ శశిధర్ తెలిపారు. విద్యార్థుల ప్రతిభను అన్ని విధాలుగా వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.