- ‘1729’ ఆకారంలో కూర్చొని గణిత శాస్త్రవేత్తకు నివాళి
వేద న్యూస్, సుల్తానాబాద్:
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను గురువారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ లో కోమలమ్మల్ శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించారని వివరించారు. ఆయన చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలార్ నియమాలు త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారని తెలిపారు.
13 ఏళ్లకే ఎస్ఎల్ లోని త్రికోణమితి పై రాసిన పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాంతాలు కూడా ప్రారంభించారని చెప్పారు. 20వ శతాబ్దంలో ప్రపంచ మేధావుల్లో ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడిగా రామానుజన్ కు దక్కిందని వెల్లడించారు.
ఆయన జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో రామానుజన్ సంఖ్యగా గుర్తింపు పొందిన నెంబర్ ‘‘1729’’ ఆకారంలో విద్యార్థులు కూర్చొని రామానుజన్ కు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.