• ట్రయల్ రన్ సక్సెస్..కిక్కిరిస్తున్న ప్రేక్షకులు
  • నెరవేరిన సుల్తానాబాద్ వాసుల చిరకాల వాంఛ
  • ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా 4 కే డాల్బీ అట్మాస్పియర్
  • అందరినీ అబ్బురపరిచేలా అన్ని హంగులతో మల్టీప్లెక్స్ ముస్తాబు
  • వినోద ప్రియులకు ఫేవరెట్ స్పాట్‌గా మల్టీప్లెక్స్.. గట్టెపల్లి రోడ్‌కు వైభవం
  • ప్రశాంత వాతావరణంలో సెంట్రల్ ఏసీతో ‘శ్రీరామ సినిమాస్’ నిర్మాణం
  • పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలను తలదన్నేలా..మారుతున్న సుల్తాన్‌బాద్ దశ-దిశ

వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి/ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో నిర్మించిన మల్టీప్లెక్స్ జిల్లాకు, స్థానికంగా మరో మణిహారం కాబోతున్నది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా వాసుల చూపు..సుల్తానాబాద్ వైపు ఉండేలా మల్టీప్లెక్స్ పరిసరాలు మారబోతున్నాయి. క్రమంగా సుల్తానాబాద్ దశ-దిశ కూడా తిరగబోతోంది. అభివృద్ధి పథంలో ఒక్కొక్క అడుగు పడుతుండగా..సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెవలప్‌మెంట్ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలనే తలదన్నేలా మారే పరిస్థితులు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు, వ్యాపారులతో పాటు సామాన్యులకు సైతం ఆలవాలంగా ఉండే సుల్తానాబాద్‌లో నగర, గ్రామీణ సంస్కృతి పరిఢవిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కావలిసిన వినోదం పంచేందుకు ఒక థియేటర్ అయినా ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో సుల్తానాబాద్ వాసులు అనుకుంటున్నారు. చిరకాల వాంఛగా అది అలానే ఉంటుందా? తీరుతుందా? అని సంశయిస్తున్న క్రమంలో వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. వారు ఇక బాధపడాల్సిన అవసరం లేకుండా..సుల్తానాబాద్ వాసుల స్వప్నం సాకారం చేశారు ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ నిర్వాహకులు.

 

‘శ్రీరామ సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్‌ను సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మించారు. సుల్తానాబాద్ నుంచి గట్టెపల్లి రోడ్డుకు వెళ్లే దారిలో రెండు థియేటర్లతో అన్ని హంగులతో మల్టీప్లెక్స్‌ను కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇక సినిమా చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంతవాసులు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాకేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ట్రయల్ రన్‌గా మల్టీప్లెక్స్ యాజమాన్యం..వారం రోజులుగా ఫ్రీగా సినిమాలు వేస్తోంది. ఉచితంగా ప్రదర్శితమవుతున్న చిత్రాలను వీక్షించేందుకు ప్రేక్షకులు కిక్కిరిసిపోతున్నారు.

సెంట్రల్ ఏసీతో పాటు వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్‌తో ఉన్న 4 కే డాల్బీ అట్మాస్పియర్ ఆడియన్స్‌ను బాగా ఆకర్షిస్తోంది. ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మల్టీప్లెక్స్ పరిసరాలు ముస్తాబు కాగా, అది చూసి జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏండ్లకు ముందు సుల్తానాబాద్‌లో ‘విజయ శివాజీ’ అనే థియేటర్ ఉండేదని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. ఇన్నేండ్ల తర్వాత మళ్లీ తమకు వినోదం పంచేందుకు మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న నిర్వాహకులను సుల్తానాబాద్ వాసులు అభినందిస్తున్నారు. కాగా, ఇప్పటికే వారం రోజుల నుంచి ఫ్రీగా మూవీస్‌ను ప్రదర్శిస్తున్న ‘శ్రీరామ సినిమాస్’ యాజమాన్యానికి ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో సౌకర్యాలను మల్టీప్లెక్స్‌లో కల్పించారని పలువురు పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి రానుందని యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రశాంత వాతావరణంలో సెంట్రల్ ఏసీతో అన్ని హంగులతో నిర్మించిన ‘శ్రీరామ సినిమాస్’ సుల్తానాబాద్ తో పాటు సమీప పరిసర ప్రాంత ప్రజలకు, వినోద ప్రియులకు ఫేవరెట్ స్పాట్‌గా మారుతుందని అంటున్నారు. అయితే, మరి కొద్ది రోజుల్లో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి, గట్టెపల్లి రోడ్ పరిసరాలను చూస్తే..అసలు సుల్తానాబాదేనా..? ఇది అన్న రీతిన అభివృద్ధి జరుగుతుందని, వైభవంగా సుల్తానాబాద్ వర్ధిల్లుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.