• తపాల కార్యాలయ సిబ్బందికి..

వేద న్యూస్, మరిపెడ:

వరంగల్ డివిజన్ మహబూబాబాద్ ప్రధాన తపాల కార్యాలయం పరిధిలోని 16 ఉప తపాల కార్యాలయ సిబ్బంది, హెడ్ పోస్టాఫీసు సిబ్బందికి సోమవారం మహబూబాబాబాద్ లోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఎంపీపీఎల్ మానుకోట పోస్టల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.

పోస్ట్ మాస్టర్ పెండ్రా రాంచందర్ టాస్ వేసి లీగ్ ను ప్రారంభించారు. హెడ్ పోస్ట్ ఆఫీసు స్టాఫ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మహబూబాబాద్ పోస్టల్ ప్రీమియర్ లీగ్(ఎంపీపీఎల్) ఈ నెల 4 నుంచి 11 వరకు జరగనుంది. కార్యక్రమంలో కోట సుధాకర్, వాసం అనిల్, తోట సురేశ్, కోట సతీష్, జాటోత్ యాకూబ్, బానోత్ సుధాకర్, కొమ్ముల బాబు, పోస్ట్ మాన్స్, ఎంటీఎస్ స్టాఫ్, జీడీఎస్ స్టాఫ్ పాల్గొన్నారు.