- సారథిగా 20 ఏండ్ల విశేష అనుభవమున్న మాస్టర్
- ఫిట్‌నెస్ సెంటర్‌గా స్టూడెంట్స్‌కు జుంబా, కరాటే తరగతులూ..
- జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో ‘ప్రసంగి’ విద్యార్థుల ప్ర‘ఖ్యాతి’
వేద న్యూస్, జమ్మికుంట:
విశ్వజననీమైన కళ ‘నాట్యం’. కాగా, ఆధునిక కాలంలో డ్యాన్స్ అనేది ప్రతీ ఒక్కరిని ఆకర్షించే ముఖ్యమైన అంశంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆధునికత, సంప్రదాయాల కలబోతగా డ్యాన్స్‌ను ప్రతీ ఒక్కరికీ నేర్పించాలనే సదుద్దేశంతో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ‘ప్రసంగి’ స్టూడియోను జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్‌లో ప్రారంభించారు.
చిన్న‘నాట’ నుంచే బెస్ట్ డ్యాన్సర్‌గా రాణించి.. డ్యాన్స్ మాస్టర్‌గా 20 ఏండ్ల విశేష అనుభవమున్న ప్రసంగి.. విద్యార్థులు, పెద్దలకు నాట్యం నేర్పుతున్నారు. ఇప్పటికే ప్రసంగి డ్యాన్స్ స్టూడియో విద్యార్థులకు జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు రావడం విశేషం.
వేదిక ఏదైనా అక్కడ జమ్మికుంట ఖ్యాతిని నిలబెట్టే దిశగా ప్రసంగి డ్యాన్స్ స్టూడియోను డ్యాన్స్ మాస్టర్ తీర్చిదిద్దుతుండటంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసంగికి మరిన్ని అవార్డులు వరించి రావాలని, ప్రసంగి కీర్తి మరింతగా పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
డ్యాన్స్ అంటే ప్రాణం..
డ్యాన్స్ మాస్టర్ ప్రసంగికి డ్యాన్స్ అంటే ఇష్టమే కాదు ప్రాణం అని చెప్పొచ్చు. చిన్న ‘నాటి’ నుంచి ఎన్నో అవార్డులను ఆయన తన నాట్యకళకు అందుకున్నారు. ప్రసంగి శిష్యులు ఎంతో మంది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్లుగా, కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. ఈటీవీ మల్లెమాల వంటి ప్రఖ్యాత సంస్థలో ప్రసంగి విద్యార్థులు పని చేస్తున్నారు.
ప్రముఖ హీరోయిన్ ఆనంది(రక్షిత)తో పాటు పలువురు ప్రసంగి వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారు. వారందరూ ప్రస్తుతం సినీరంగంలో ముందుకెళ్తున్నారు. నాడు జెమినీ టీవీలో నిర్వహించిన ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’, ఈటీవీ వారి ‘ధమ్ రిథమ్’, మా టీవీ వారి ‘డుమ్ డుమ్ డిగా డిగా’, జీతెలుగు వారి ‘ఆట-4,5’ వంటి కార్యక్రమాల్లో ప్రసంగి పాల్గొని సత్తా చాటారు. కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా ఆయన కనబరిచిన ప్రతిభను ఆయా కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలు మెచ్చుకున్నారు.
‘ప్రసంగి’ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్లు సిద్ధు, సంజయ్, సరిత, విశ్వరాజ్(కె.రాజేశ్)లు అందుబాటులో ఉంటారు. ప్రసంగి డ్యాన్స్ స్టూడియో ప్రొప్రైటర్‌గా డ్యాన్స్ మాస్టర్ ప్రసంగి సతీమణి ఎన్.శ్రీలత నిత్యం స్టూడియోలో అందుబాటులో ఉంటారు.
ఉన్నత లక్ష్యంతో ముందడుగు..
తన ప్రాంతానికి తన వంతుగా సేవ చేయాలని, కళను ప్రోత్సహిస్తూ.. కళాకారులకు దిశానిర్దేశం చేయాలని, సన్మార్గం వైపు తన ప్రాంత యువత నడవాలనే సమున్నత లక్ష్యంతో ఆచరణలో ముందుకు అడుగు వేసిన యువకెరటం ప్రసంగి అని చెప్పొచ్చు.
జమ్మికుంట పట్టణ, మండల, పరిసర, సమీప ప్రాంత యువత చెడు మార్గం వైపు అసలు వెళ్లకుండా..సన్మార్గం వైపు మాత్రమే నడిచేలా.. వారిని నాట్య కళ వైపునకు మళ్లించేలా ప్రసంగి డ్యాన్స్ స్టూడియో నెలకొల్పగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘ప్రసంగి’ విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో అవార్డులు గెలుచుకుని జమ్మికుంట, ‘ప్రసంగి’ స్టూడియో ఖ్యాతిని నిలబెడుతున్నారు.
ఉన్నత విద్యావంతుడు మాస్టర్ ప్రసంగి
ఉన్నత విద్యావంతుడు అయిన ప్రసంగి సారథ్యంలో స్టూడియో మరింత ముందుకు సాగుతుందని పలువురు పట్టణవాసులు ఆకాంక్షిస్తున్నారు. ప్రసంగి డ్యాన్స్ స్టూడియోలో జాయిన్ అయిన ప్రతీ ఒక్కరినీ డ్యాన్స్ మాస్టర్లు మానిటర్ చేస్తూ.., టీమ్ పరంగానే కాక ఇండివిడ్యువల్‌గానూ ప్రతీ ఒక్కరు ఎక్సెల్ అయ్యేలా శ్రద్ధ కనబరుస్తున్నారు. వారికి సరైన గైడెన్స్‌నూ ఇస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని వైద్యులు సైతం దాదాపుగా ప్రసంగి డ్యాన్స్ స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకుంటున్నారు.
ఈ స్టూడియోలో ప్రతీ ఒక్క పండుగను అందరూ సెలబ్రేట్ చేసుకునేలా వేడుకలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. కుల, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అని సందేశాన్ని విద్యార్థులో నింపేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి. స్టూడియోలో ప్రస్తుతం 30 మంది పిల్లలతో పాటు 8 మంది పెద్దలకు డ్యాన్స్ క్లాసెస్ నడుస్తున్నాయి.
జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా అంతర్జాతీయంగా ధ్రువీకరణ పత్రం పొందిన డ్యాన్స్ మాస్టర్‌గా ప్రసంగి నిలవడం విశేషం. జుంబా, యువతులు, మహిళలకు కరాటేతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌ను ప్రసంగి నేర్పిస్తున్నారు.
కళాకారులకు ప్రోత్సాహమే లక్ష్యం: డ్యాన్స్ మాస్టర్ ప్రసంగి
జమ్మికుంట పట్టణ, మండల, పరిసర, సమీప ప్రాంతాల్లోని కళాకారులను ప్రోత్సహించడమే నా లక్ష్యం. ఈ ప్రాంతంలోని ఆర్టిస్టులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా వారికి సమీపంలోని జమ్మికుంటలో ఉంటూ.. వారిని ప్రోత్సహిస్తూ.. వారిలో ధైర్యం, ఆత్మ విశ్వాసాన్ని నిండుగా, మెండుగా నింపుతూ.. వారిని వారి లక్ష్యం వైపు ముందుకు నడిపించడమే నా టార్గెట్.
పిల్లలకు వారి చదువుల విషయంలోనూ సరైన మార్గనిర్దేశనం చేస్తా. నెలకోసారి వారి ఎడ్యుకేషన్ విషయమై దృష్టి సారిస్తా. 24/7 స్టూడియోలో అందుబాటులో ఉంటూ..వారి నడత, నడక సన్మార్గంలో ఉండేలా నా వంతు సూచనలు, సలహాలు ఇస్తా. ముఖ్యంగా చిన్నారులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తా. అమ్మాయిలను అనుకోని పరిస్థితులు ఏవి ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తా. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ‘ఆత్మహత్య’ అనే ఆలోచన రాకుండా.. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తా.
బెస్ట్ డ్యాన్స్ స్కూల్: జమ్మికుంటవాసులు
ప్రసంగి డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్ ప్రసంగి డ్యాన్స్‌ను చాలా చక్కగా నేర్పిస్తారని స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకుంటున్న మహిళలు పేర్కొన్నారు. అసలేమీ రాని తమకు చక్కగా ఓపికతో స్టెప్స్ నేర్పించి.. తమ కుటుంబ సభ్యులు అందరూ మెచ్చుకునేలా చక్కటి డ్యాన్స్‌ను నేర్పించారని ‘ప్రసంగి’ స్టూడెంట్స్ పేర్కొన్నారు.
‘ప్రసంగి’ డ్యాన్స్ స్టూడియో విద్యార్థులలో జమ్మికుంట పట్టణంలోని ప్రముఖులు, వైద్యులు ఉండటం విశేషం. చక్కటి డ్యాన్స్‌ను మాస్టర్ ప్రసంగి అందరికీ నేర్పస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. ‘ప్రసంగి’ ఖ్యాతి మరింతగా విస్తరిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.








