వేద న్యూస్, నర్సంపేట : 

ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల భూమిక కీలకమని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి అన్నారు. మంగళవారం నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి తొ కలసి నర్సంపేట బిట్స్ కళాశాలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రిసైడింగ్ (పి. ఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి మాట్లాడుతూ లోకసభ ఎన్నికలల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల శిక్షణ లో భాగం గా తొలి విడత ట్రైనింగ్ ను అందజేయడం జరుగుతుందని, బ్యాలెట్,కంట్రోలింగ్ యూనిట్,వి.వి.ప్యాట్ ల అమరిక తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు.బాధ్యతయుతంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, 2వ, 3వ దఫా లలో శిక్షణ నిర్వ నిర్వహిస్తామని అన్నారు. పి. ఓ లకు సెక్టార్ ఆఫీసర్స్ పూర్తి సహకారం అందజేస్తారని తెలిపారు. ఎన్నికల లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని అన్నారు. శిక్షణ లో భాగం గా తొలి రోజు పి. ఓ లు, ఏ.పి. ఓ.లు శిక్షణ పొందినట్లు అధికారులు వెల్లడిస్తు మరో 2 రోజులు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ లు, తదితరులు పాల్గొన్నారు.