పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి.
భీమారంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి .
విద్యా కేంద్రమైన భీమారంలో ప్రైవేట్ విద్యాసంస్థల దందాపై చర్యలు తీసుకోవాలి.
AISF జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్ డిమాండ్
వేద న్యూస్, హన్మకొండ:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భీమారం ఏరియా
కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ భీమారం ఏరియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ సర్కిల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల భాను ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 7000 కోట్ల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులని ఫీజులు చెల్లించాలని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి ఎగ్జామ్స్ రాయడానికి అనుమతి ఇవ్వడం లేదు, విద్యా సంవత్సరం అయిపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, దీని పట్ల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమైతున్నారని ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమని వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రధాన విద్యా కేంద్రంగా ఉన్న భీమారంలో పెరిగిన విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ప్రభుత్వ, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, భీమారం కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దందాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ భీమారం ఏరియా అధ్యక్ష కార్యదర్శులు బొంకూరి భాను, పి సుధీర్, భీమవరం ఏరియా ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, అక్షయ్ ,రాజు, కొట్టే వంశీ, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.