• వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్‌లో నీటి వృథా 
  • కేర్‌టేకర్ వేణు నిర్లక్ష్యం

వేద న్యూస్, వరంగల్/కేయూ:

వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ (కాకతీయ విశ్వవిద్యాలయం)లో కేర్‌టేకర్ నిర్లక్ష్యంతో నీరు వృథాగా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌కు సంబంధించిన నీటి ట్యాంక్ నుంచి నిరంతరంగా నీరు పొర్లిపోతూ వృథా అవుతోంది. ఈ విషయాన్ని పలుమార్లు కేర్‌టేకర్ వేణు దృష్టికి తీసుకెళ్లినా, ఆయన నుంచిఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని వారు తెలిపారు.

కేర్ టేకర్ పదవికి తగ్గట్టుగా విధులకు నిష్ఠతో వ్యవహరించకుండా, ప్రాథమిక సమస్యలపైనే ఉదాసీనంగా ఉండటం హాస్టల్‌లోని వనరుల దుర్వినియోగానికి కారణమవుతోంది. విద్యార్థుల సహజీవనానికి ఇది అంతరాయంగా మారుతుందని, వెంటనే హాస్టల్ డైరెక్టర్ దీనిపై స్పందించి కేర్ టెకర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.