®

 

వేద న్యూస్, ఆసిఫాబాద్:

ఈ నెల 23 వ తేదీన వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన బాక్సింగ్ పోటీలలో జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బికాం రెండవ సంవత్సరం చదువుతున్న ఎం ఉషా అరణ్య, బిఏ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎస్ పుష్పలత లు సత్తా చాటి డిసెంబర్ 17 న పంజాబ్ లోని ఎల్పీయూ యూనివర్సిటీ లో జరిగే ఆల్ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డి. శారద, ఏ. ఓ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి విద్యార్థులు, పీడీ హారికను అభినందించారు.

ఆల్ ఇండియా స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.