- బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్
వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం లో పీఎంకేవీవై ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమం లో బీసీ యువజన సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ( PMKVY) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఉచిత కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్ డెవోలోప్ మెంట్ తదితర వాటిపై ఉచిత శిక్షణ అందించి కొన్ని కంపెనీ ల ద్వారా యువత కి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహం అందిస్తోందని వివరించారు.
ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించారని, ఈ నేపథ్యంలో ఇలాంటి అవకాశాలను విద్యార్థులు యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఎంకేవీవై అధ్యాపకులు దుర్గం నరేష్, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.