• ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభ్యర్థి వొడితల ప్రణవ్ పిలుపు
  • నాయకులతో కలిసి జమ్మికుంట డిగ్రీ కాలేజీలో ‘విజయభేరి’ సభాస్థలి పరిశీలన

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు(గురువారం) కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. జమ్మికుంటలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

రేవంత్ రెడ్డి బహిరంగ సభకు నియోజకవర్గం లోని ప్రజలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, టీపీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి నాగ మధు యాదవ్, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, శివకుమార్ గౌడ్, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కసబోజుల వెంకన్న, జమ్మికుంట మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిని రవి, ఎండి సజ్జత్ గూడెపు సారంగపాణి, ఎండి ఇమ్రాన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు అన్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.