వేద న్యూస్, డెస్క్:

ఈ వీడియో చూస్తే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ తల్లి  బుజ్జి చిరుతను ముద్దాడుతున్న సమయంలో మరో మూడు నాలుగు చిరుత కూనలు ఒంటి మీదకు వస్తుంటే.. సాధారణంగా మనమైతే భయపడిపోతుంటాం. కానీ, ఆ మాతృమూర్తి మాత్రం ప్రేమతో సదరు చిరుత కూనలకు ప్రేమను పంచుతోంది. 

ఆకాంక్ష పర్మర్ అనే ‘ఎక్స్’ యూజర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘‘సావిత్రమ్మ.. ద హీలింగ్ హ్యాండ్స్ ఆఫ్ ద జూ, ‘హార్ట్ ఆఫ్ ది జూ’ ’’ శీర్షికన ఆమె షేర్ చేసిన వీడియో చూసి నెటిజనాలు షాకవుతున్నారు. చిరుత పులులు వైల్డ్ గా ఉంటాయి కానీ, ఆమెకు(అమ్మ) మాత్రం కుటుంబమే అని పేర్కొంటున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రీట్వీట్ చేస్తున్నారు. పోస్టును మరింత వైరల్ చేస్తున్నారు.

వీడియోలో సావిత్రమ్మ తొలుత ఓ బుజ్జి చిరుతను దగ్గరకు తీసుకుని దాని నొసట మీద ముద్దిస్తూ.. ముద్దాడుతున్న క్రమంలో.. మరో రెండు బుజ్జి చిరుత కూనలు సావిత్రమ్మ చీర చింగుల నుంచి ఒడిలోకి వచ్చేందుకు ఎగురుతుండటం గమనించొచ్చు. అదే సమయంలో మరో చిరుత.. కర్రపైకి వెక్కి.. సావిత్రమ్మ వీపుమీదకు వస్తుండటం పరిశీలించొచ్చు.  అమ్మ తన బిడ్డలతో ఎలా సమయం గడుపుతుందో.. అలా సదరు తల్లి సావిత్రమ్మ.. చిరుత కూనలకు తల్లిగా ఆలంబనగా నిలుస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 

 

https://x.com/iAkankshaP/status/1934800601952449022