వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నికల వేళ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుధాల చట్టాన్ని అనుసరించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను కలిగి వున్న వ్యక్తులు, ప్రవైట్ సంస్థలు తమ వద్ద వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ అప్పగించాల్సి వుంటుందని అన్నారు. ఈ ఉత్తర్వులు ఉల్లాంఘిస్తే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 201 అనుమతి వున్న తుపాకులు వున్నాయని, ఇందులో హనుమకొండ జిల్లా లో 131, వరంగల్ జిల్లాలో 52, జనగామ జిల్లా లో 18 అనుమతులు వున్న తుపాకులు ఉన్నాయన్నారు. పోలీస్ స్టేషన్లో అందజేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి అందజేయబడుతుందని తెలిపారు.అలాగే జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.