- ఆత్మీయం.. అపూర్వ సమ్మేళనం
వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా భీమారం పరిధిలోని ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో 2007-10విద్యా సంవత్సరంలో డిగ్రీ చదివిన విద్యార్థులు చదువుకున్న ఆ కాలేజీ వేదికగా ఆదివారం పూర్వ విద్యా ర్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి.. ఆశీర్వాదా లు తీ సుకున్నారు. ఈసందర్భంగా డిగ్రీ కళాశాలలో గడిపిన సంగతులను నెమరు వేసుకుని మురిసిపోయారు. ఆ ‘నాటి’ రోజులు తిరిగి రావని, స్నేహగీతం పాడుకున్నారు.
ఉరుకుల పరుగుల జీవనంలో హాయిగా తమ స్నేహితులందరితో కలిసి .. రోజంతా టైం స్పెండ్ చేశారు. ఆ ‘నాటి’ గురుతులన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుని..నాస్టాల్జియా గా ఫీలయ్యారు. ఒకరికి మరొకరు స్నేహితులందరూ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ గెట్ టు గెదర్(ఆత్మీయ సమ్మేళన) కు ప్లాన్ చేసిన వారిని స్నేహితులందరూ ప్రత్యేకంగా అభినందించారు.