వేద న్యూస్, వరంగల్:
ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మిలీనియం యూత్ అసోసియేషన్ నీరుకుళ్ల ఆధ్వర్యంలో భోళా శంకరుడి తనయుడు బొజ్జ గణపయ్య కు పూజలు చేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్ సభ్యులకు అందరికీ టీ షర్ట్స్ బహుకరించారు. ఈ సందర్భంగా కోడెపాక కుమారస్వామిని మిలియన్ యూత్ సభ్యులు సభ్యులు అందరూ శాలువాతో ఘనంగా సన్మానించారు.