వేద న్యూస్, వరంగల్: 

సేవే లక్ష్యంగా ఏర్పాటైన ఆల్-అమన్ ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ వరంగల్ నగరం శంభునిపేట్ కి చెందిన తాహ కమిటీ సభ్యులు కుల, మతాలకు అతీతంగా నగరంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ముస్లిం యువత కలిసి నిరుపేదలకు బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు పలువురికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా తాహ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజ సేవలో ముందుండాలని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.కాగా నగరంలో తాహ కమిటీ చేస్తున్న సేవ కార్యక్రమాలను చూసి పలువురు అభినందిస్తున్నారు.