వేద న్యూస్, వరంగల్:
కమలాపూర్ మండలం జూజునూరు గ్రామంలోని డ్రైనేజీ నీరు వెళ్లే కల్వర్టు అక్రమంగా మట్టి పోసి మూసివేయడంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.
మర్రిపల్లి గూడెం నుండి జోజునూరుకు వెళ్లే ఆర్ అండ్ బి దారిలో డ్రైనేజీ కాలువ నీరు వెళ్లడం కోసం ఏర్పాటు చేసిన కల్వర్టును ఓ వ్యక్తి అక్రమంగా ఆక్రమించి మట్టి పోయడంతో.. నీరు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని తక్షణమే అధికారులు స్పందించి తమ ఇండ్లలోకి నీరు చేరకుండా, అక్రమంగా కల్వర్టును పూడ్చి వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.