వేద న్యూస్, ఆసిఫాబాద్:

కేపీఎల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 29న టాలెంట్ హంట్ టెస్ట్ నిర్వహించనున్నట్టు సెంటర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ పటేల్ లొనారె తెలిపారు. 4,5 వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ కు నవోదయ, సైనిక్, గురుకులం కోచింగ్ కోసం ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు.

ఈ టెస్ట్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా నవోదయ కోచింగ్ తీసుకునే వారికి ఫీజులో రాయితీ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 కాగా, రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ నెల 28 అని వెల్లడించారు.

ఆసిఫాబాద్ లోని మాతృశ్రీ జూనియర్ కాలేజీలో టెస్ట్ కండక్ట్ చేయనున్నారు. ఈ కోచింగ్ సెంటర్ లో నర్సరీ నుంచి 10 వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు ట్యూషన్ చెబుతామని నిర్వాహకులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫీజు చెల్లింపుతో పాటు మరిన్ని వివరాలకు 95052 72311 నంబర్ లో సంప్రదించొచ్చన్నారు.