వేదన్యూస్ -ఒంగోలు
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతను ఆయన కార్యాలయంలో అతిదారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ఒంగోలు కు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి.. మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని కొంతమంది దుండగులు ముసుగులతో ఒంగోలు పద్మ టవర్స్ లో ఉన్న ఆయన కార్యాలయంలోనే ప్రవేశించి అతిదారుణంగా చంపారు.
అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలులో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.