- ప్రధానోపాధ్యాయులు అనంతరావు
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట రాధాకృష్ణన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరావు, విద్యార్థిని విద్యార్థులు కలిసి ఉపాధ్యాయులని పుష్పగుచ్చాలతో, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు పని చేయాలని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులను సమాజం గుర్తిస్తుందని, భావి భారత నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి బయగాని రామ్మోహన్ ఉపాధ్యాయ బృందం జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, లెనిన్, ప్రసాదరావు, సారయ్య జహెదా, సురేష్, బాబురావు, రాజ కుమారి, సుధ, మంజుశ్రీ, పద్మ, భువనేశ్వరి, శంకర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.