వేద న్యూస్ , వరంగల్:
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) అఫిలియేటెడ్ టూ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్- ఇండియా(ఎన్ యూజే-ఐ) వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక టీఎస్ జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ ఆధ్వర్యంలో కరీమాబాద్ బొమ్మల గుడిలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
పోతరవేని రాజన్న టీఎస్ జేయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు
ఎన్నికైన వారిలో వరంగల్ జిల్లా అధ్యక్షులుగా పోతరవేని రాజన్న, ప్రధాన కార్యదర్శిగా లింగబత్తిని కృష్ణ, కోశాధికారిగా బత్తుల సత్యం, ఉపాధ్యక్షులుగా శీలం రమేష్, కందికొండ గంగరాజు, సహాయ కార్యదర్శులుగా ఈద శ్రీనాథ్, వల్లెపు భాగ్యరాజు, నాగపూరి నాగరాజు, సహాయ కోశాధికారిగా ఆవునూరి కుమారస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రావుల నరేష్, పంచకం నర్సయ్య, అడుప అశోక్, కార్యవర్గ సభ్యులుగా పారిజాతం సంతోష్ కుమార్, గోనె కమలాకర్, నాగపూరి అవినాష్, సుంకరి కళ్యాణ్ లు ఉన్నారు.
లింగబత్తిని కృష్ణ, టీఎస్ జేయూ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వరంగల్ జిల్లా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది జర్నలిస్టులేనని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం ,హక్కుల కోసం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
బత్తుల సత్యం టీఎస్ జేయూ వరంగల్ జిల్లా కోశాధికారి
అనంతరం నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్- ఇండియా (ఎన్ యూజే, ఐ) జాతీయ ఉపాధ్యక్షులు నారగోని పురుషోత్తం, టీఎస్ జేయూ రాష్ట్ర అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.