•  జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రమేశ్
  •  కాలేజీలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి నేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలను ఇన్ చార్జి ప్రిన్సిపాల్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్, డాక్టర్ కె. రాజేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. రవి, ఎల్. రవీందర్, అధ్యాపకులు డాక్టర్ ఎం.శ్యామల, వి. కిరణ్ కుమార్, డాక్టర్ కె. మాధవి, డాక్టర్ గణేష్, కె. ఉమాకిరణ్, డాక్టర్ సుష్టు, డాక్టర్. రవి ప్రకాశ్, మమత, ప్రశాంత్, అరుణ్జ్, సాయికుమార్, అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.