•  ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
  • నూతనంగా ఎన్నికైన డివిజన్, మండల అధ్యక్షులకు దిశా నిర్దేశం 

వేద న్యూస్, వరంగల్ :

బూతు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గ డివిజన్ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికై వారికి సూచించారు. మంగళవారం బీజేపీ వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గ డివిజన్ మండల అధ్యక్షులు గా నూతనంగా ఎన్నికై వారికి జిల్లా పార్టీ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా శ్రమించాలని అన్నారు. రాబోయే పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పారు.ఏ ఎన్నికైనా సరే కాషాయం జెండా ఎగరడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

దేశ రక్షణ, పేదల సంక్షేమం కోసం మరోసారి మోడీ ప్రధాని కావాలని ఇదే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు బూత్ స్థాయిలో చేరికలు చేపట్టాలన్నారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. నియోజకవర్గస్థాయిలో వచ్చే 15 రోజుల్లో ప్రతి బూత్ కి ఐదుగురు చేరేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

చేసే ప్రతీ కార్యక్రమం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. బూతుల్లో ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను పంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరిస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు.

యువత దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుందని, యువత తలుచుకుంటే రాజకీయాలు మారిపోతాయన్నారు. వచ్చే ఎన్నికలలో వరంగల్ జిల్లాలో బీజేపీ జెండా ఎగరవేయడమే మనందరి లక్ష్యంగా ముందుకుసాగుదామని పిలుపునిచ్చారు.

పార్టీ బలం పెంచే విధంగా మోడీ కోసం, దేశం కోసం పోరాటం చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ , కంభంపాటి ప్రతాప్, పిట్టల కిరణ్, కుడికల శ్రీధర్ ,రాధారపు శివకుమార్, ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, గాడిపెళ్లి రాజేశ్వరరావు, రేసు శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు, స్పోక్స్ పర్సన్ మార్టిన్ లూథర్, తాబేటి వెంకట్ గౌడ్, నర్సంపేట చేరికల కమిటీ కన్వీనర్ రాణా ప్రతాప్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందిమల్ల మహేష్ ,మహిళ మోర్చా బండారి కళ్యాణి , కిసాన్ మోర్చా శేషాద్రి, యువమోర్చా భరత్ వీర్ , మైనారిటీ మోర్చా రహమతుల్లా, మరియు నూతనంగా నియమింపబడిన మండల , డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.