వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలతో పాటు వారు నిర్వహిస్తున్న వివరాలను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్ పరిధిలోని కేడీలు, డిసిలు, రౌడీ షీటర్ల కు సంబందించిన వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ప్రస్తుతం పెండింగ్ కేసులతో పాటు, నేరాలు,శాంతి భద్రత నియంత్రణ కోసం ముందుస్తుగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టర్ పి.మల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ వెంట ట్రైనీ ఐ. పి. ఎస్ శుభం నాగ్, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ఉన్నారు.