వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
వరకట్న వేధింపులు తాళలేక తన ఏడునెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ముఖ్య నిందితుడు మృతురాలి భర్త ఎండీ తన్వీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.ఫిబ్రవరి 1న అదనపు కట్నం కోసం భర్త తన్వీర్ కొట్టడంతో తస్లీమ్ అనే వివాహిత తన 7నెలల కుమారుడితో పర్వతగిరి మండలం అన్నారం దర్గా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలి తండ్రి ఎస్.కె. అఫ్జల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చెప్పట్టిన పోలీసులు తల్లీ,కుమారుడి మృతికి వరకట్న వేధింపులే కారణం అని ప్రాథమికంగా నిర్ధారించి మంగళవారం సాయంత్రం ప్రధాన నిందితుడు ఎండీ తన్వీర్‌తో పాటు మరో 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ సురేష్ గౌడ్ తెలిపారు.