వేద న్యూస్, హన్మకొండ:
భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ‘బీసీ గర్జన సభ’కు వచ్చిన సందర్భంగా ఆయన్ను ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివాజీ..ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఆరె కుల ఓబీసీ సమస్య గురించి వివరించారు. ప్రధాని స్పందిస్తూ త్వరలో ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో కలిపే ప్రక్రియను పూర్తి చేసి శుభవార్త చెపుతామని హామీ ఇచ్చినట్లు చెట్టుపల్లి తెలిపారు.